ఆర్మూర్, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం మహాత్మా గాంధీ 74వ వర్ధంతి సందర్బంగా ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెరాస సీనియర్ నాయకులు పోల సుధాకర్, పండిత్ ప్రేమ్, పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ మాట్లాడుతూ భారతదేశానికి శాంతి అహింస మార్గాలతో దేశభక్తి నినాదాలతో భారతదేశ పౌరులను ఏకం చేసి శాంతి బాటలో స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీజీని హతమార్చడం చాలా బాధాకరమని తెలిపారు.
గాంధీజీ చేపట్టిన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తాటి హన్మండ్లు, యువజన విభాగం అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నరేష్, సురేష్ వర్మ, కందేష్ సత్యం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.