కామారెడ్డి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎం భవనంను ఆదివారం చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ శశాంక్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈవీఎం, వివి ప్యాట్ల్ను ఈ భవనంలో భద్రపరుచుకోవచ్చునని సూచించారు. అంతకుముందు ఆయనకు జిల్లా అధికారులు మొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, నిజామబాద్ ఆర్అండ్బి ఎస్.ఈ. రాజేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్, ఎఈ రవితేజ, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, గుత్తేదారు మధుసూదన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.