కామారెడ్డి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి గాంధీ గంజిలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ సముదాయం పనులను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, గుత్తేదారు మధుసూదన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.