కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 42 వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. అర్హులందరికీ క్షేత్రస్థాయిలోనే వ్యాక్సినేషన్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకాలు వేయించుకోవాలని కోరారు.
ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేయాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కోరారు. వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, స్వల్ప లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య కార్యకర్తను కలిసి హోమ్ ఐసోలేషన్ కిట్లను తీసుకోవాలని తెలిపారు.
ఐదు రోజుల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే తగ్గుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వోలు చంద్రశేఖర్, శోభారాణి, వైద్యులు సుజాత్ అలీ, సుధాకర్, సువర్ణ, పర్యవేక్షకుడు వెంకటరమణ, కౌన్సిలర్లు ప్రవీణ్, సయ్యద్ అన్వర్ హైమద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.