పలువురు డాక్టర్లకు పాజిటీవ్..
పారిశుధ్య కార్మికులకూ…
ఇలాగే ఉంటే డాక్టర్ల కొరత…
వైద్యులను కరోనా కలవరపెడ్తుంది. కోవిడ్ రోగుల తాకిడి పెరుగడంతో ఇబ్బంది పడ్తున్నారు. మరోవైపు పలువురు వైద్యలు వ్యాధి భారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 46 మంది డాక్టర్లకు పాజిటీవ్ రిపోర్ట్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రంట్ లైన్ సిబ్బంది నర్సులు, పారిశుధ్య కార్మికులూ కొవిడ్ బారిన పడుతున్నారు.
ఉస్మానియా వైద్య కళాశాలలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థులు 15 మంది, ప్రసూతి ఆస్పత్రికి చెందిన 18 మంది వైరస్ బారిన పడ్డట్టు సమాచారం. నిమ్స్ లో 13 మంది వైద్యులు కోవిడ్ కు గురయ్యారు. కింగ్ కోఠి ఆస్పత్రికి చెందిన ముగ్గురు పారిశుద్య సిబ్భంది, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికీ కరోనా సోకడంతో పలువురుని క్వారెంటైన్ కు తరలించారు.
గురువారం నాటికి…
మొత్తం కేసుల సంఖ్య ….3147
గురువారం నమోదైన కేసులు…127
కరోనా మరణాలు…..127
హైకోర్టు ఆందోళన…
వైద్యులకు కరోనా సోకడంపై హైకోర్టు స్పందించింది. వైద్యులకు కల్పిస్తున్న వసతులు, కోవిడ్ రాకుండా తీసుకుంటున్న చర్యలపై నివేధిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అశంపై దాఖలైన ఏడు రిట్ పిటీషన్లను ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎస్. చౌహన్, న్యాయమూర్తి బి. విజయసేనా రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసును ఈ నెల 8 కి వాయిదా వేసింది.