కామారెడ్డి, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చిందని ప్రజలకు పూర్తి అనుకూలంగా ఉందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్లో విద్య, వైద్యం, పారిశ్రామిక, రైతులు, పేద, మధ్యతరగతి, ఉన్నత ప్రజలను అందరికి సంతృప్తి పరిచేలా ఎవరిపై అదనపు భారం లేకుండా ఉందని అన్నారు. డిజిటల్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు మారు మూల గ్రామాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు ఇలా డిజిటల్ ఇండియాగా మరి క్యాష్ లెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
నదుల అనుసంధానం, ఎరువుల సబ్సిడీ, వెయ్యి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం, ఇలా రైతులకు కావాల్సిన అన్ని బడ్జెట్లో పొందుపరిచారని అన్నారు. అంగన్వాడిల ఆధునీకరణ, పేదలకు 18 లక్షల ఇళ్ల కేటాయింపు, ప్రతి గ్రామానికి ఆప్టికల్ కేబుల్, ప్రతి ఇంటికి మంచి నీటి పథకము ఇలా గ్రామాల అభివృద్ధిని మరవలేదని అన్నారు.
400 వందే భారత్ రైళ్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, డిజిటల్ యూనివర్సిటీ, రాష్ట్రాలకు వడ్డీ లేని రుణ పరిమితిని 50 ఏళ్ళకి పెంపు, తరగతికి ఒక టీవీ చానల్ చొప్పున 200 టీవీ చానెల్ల ఏర్పాటు, సులభంగా ఆదాయపు పన్ను చెల్లింపు ఇలా ప్రతి అంశం భవిష్యత్తులో భారత్‌ని ఉన్నతంగా తీర్చిదిద్దే అంశమే అని ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే పదేళ్ళలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారబోతోందని అన్నారు.