కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మినుకురి బ్రహ్మానందరెడ్డి నియమితులయ్యారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అదేశాలు మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి మాజీ ప్రతిపక్ష నేత సమన్వయం కమిటీ తెలంగాణ కన్వీనర్ మహ్మద్ షబ్బీర్ అలీ చుక్కాపూర్ గ్రామానికి చెందిన మినుకురి బ్రమనందరెడ్డికి మాచారెడ్డి మండల ప్రధాన కార్యదర్శిగా నియమించి నియమాక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు మహమ్మద్ షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. మాచారెడ్డి మండలంలోని కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో కలిసి కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తన పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారి కోసం ఆపధలో ఉన్న వారందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ పదవి కేటాయించినందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులకు సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ రావు, మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్, సీనియర్ నాయకుడు కారంగుల అశోక్ రెడ్డి, బంజేపల్లి సర్పంచ్ నౌసీలాల్, చుక్కాపూర్ రాజిరెడ్డి, పండ్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.