కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్, కోశాధికారి దస్తిరాం, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజీవరెడ్డి, సెక్రటరీ రఘుకుమార్, డివిజన్ ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా కరస్పాండెట్ పీవీ నర్సింహం, వైస్ చైర్మన్ లక్ష్మణ్, డివిజన్ సెక్రటరీ జమిల్, కామారెడ్డి మండల చైర్మన్ నితీష్ రెడ్డి, ఎంసి సభ్యులు వెంకటేశం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోనే మొట్ట మొదటగా 20 రూపాయలు చెల్లించి ప్యాట్రన్ సభ్యుడిగా గంప గోవర్ధన్ సభ్యత్వం తీసుకోవడం పట్ల రెడ్ క్రాస్ సోసైటీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ తన సహకారం ఎల్లపుడూ రెడ్ క్రాస్ సొసైటీకి వుంటుందని అన్నారు. అనంతరం ఈ మధ్యనే రక్తదానం చేసిన కామారెడ్డి ఆర్టీసి సిబ్బందికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతుల మీదుగా 5 వేల మాస్క్‌లను అందించారు.