నసురుల్లాబాద్, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టిఐ అవగాహన రక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా 2022 సంవత్సరం క్యాలెండర్ని నసురుల్లాబాదు తహసీల్దార్ బాబాయ్య, నసురుల్లాబాదు ఎస్ఐ నారాయణ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
జిల్లా ఉపాధ్యక్షులు మొగులయ్య మాట్లాడుతూ ఆర్టిఐని అందరూ వినియోగించుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా ఆర్టిఐ ద్వారా పోదవచ్చని పేర్కొన్నారు. ఆర్టిఐకి ప్రభుత్వ ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ ప్రెసిడెంట్ హన్మాండ్లు, నసురుల్లాబాదు అధ్యక్షులు సాయన్న, నసురుల్లాబాదు సర్పంచ్ సాయిలు, శంకర్, శ్రవణ్, అనిల్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.