టీయూను పరిశోధనా ప్రాంగణంగా తీర్చిదిద్దుతా…

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల సమావేశ మందిరంలో శుక్రవారం రెగ్యూలర్‌, కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరితో వీసీ ఆచార్య రవీందర్‌ గుప్తా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ నెల 1 వ తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైనందు వల్ల అధ్యాపకులందరితో పాఠ్యప్రణాళికలు, టైం టేబుల్‌, వర్క్‌ లోడ్‌ వంటి అంశాలతో పరస్పరం చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అధ్యాపకులు వారి వారి బయో డాటాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని కోరారు. అకడమిక్‌ పరంగా వృద్ది పొందాలని సూచించారు. న్యాక్‌ అగ్రిడియేషన్‌ సాధించడం కోసం నేషనల్‌ ర్యాంకింగ్‌ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో తెలంగాణ యూనివర్సిటీ స్థానం కోసం ప్రయత్నం చేయాలని కోరారు. అదే విధంగా పరిశోధనా రంగంలో అభివృద్ధిని సాధించాలని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలోని పరిశోధనలకు తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి, సోషల్‌ సైన్సెస్‌ రంగాలలోని పరిశోధనలకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్సెస్‌ రీసర్చ్‌ సన్స్థలకు ప్రపోజల్స్‌ పంపాలని కోరారు.

తనకు ఉన్న ప్రపంచ ర్యాంకును అధిగమించడం కోసం నిరంతరం అంతర్జాయ పత్రీకల్లో నానో టెక్నాలజీ, మెమరీ డివైసెస్‌, స్పిన్‌ డ్రాన్‌ డివైసెస్‌ వంటి సబ్జెక్టులలో ప్రచురణలు చేస్తున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు కోరిన సదుపాయాలను కల్పిస్తామని వీసీ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, కళారూపాలకు సంబంధించిన తెలంగాణ అధ్యయన కేంద్రాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు.

న్యాయ శాస్త్ర విభాగంలో ఆన్‌లైన్‌ జర్నల్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఎకనామిక్స్‌ విభాగంలో కంప్యూటర్‌ లాబ్‌లో పీజీ విద్యార్థులకు డిసర్టేషన్‌ కోసం డాటా బేసెస్‌, సాఫ్ట్‌ వేర్‌ను అప్‌లోడ్‌ చేస్తామని అన్నారు. ఎంసిఎ డిపార్ట్‌ మెంట్‌లో న్యూ సెలబస్‌ ప్రకారం పుస్తకాలు, పరిశోధనల కోసం పుస్తకాలు కొనుకోలు చేస్తామని పేర్కొన్నారు.

అదే విధంగా ఆర్ట్స్‌ విభాగాల కోసం హ్యుమానిటీస్‌ బిల్డింగ్‌ను నిర్మాణం చేయడం కోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. లాంగ్వేజ్‌ ల్యాబ్‌ను పునరుద్ధరణ చేస్తూ సరికొత్త ఫాంటులను పొందుపరుస్తామని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే శాస్త్ర, సాంకేతిక, సోషల్‌ సైన్స్‌, కామర్స్‌ రంగాలలో పరిశోధనల కోస రీసెర్చ్‌ ప్రాజెక్టులకు నోటిఫికేషన్‌ వేస్తామని అన్నారు.

దక్షిణ ప్రాంగణంలో అవసరమైన ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ను కల్పిస్తామని విసి తెలిపారు. సమావేశంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. నాగరాజ్‌, ప్రధాన క్యాంపస్‌ కళాశాల, దక్షిణ ప్రాంగణం బిక్నూర్‌ కళాశాల, సారంగపూర్‌ కళాశాలలోని విభాగాల వారిగా రెగ్యూలర్‌, కంట్రాక్ట్‌ అధ్యాపకులు పాల్గొన్నారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »