బాన్సువాడ, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న భారతరత్న జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని (ఏ.ఐ.ఎస్.బీ) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో కోవిడ్ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని మాస్క్‌లు, భౌతిక దూరం, శనిటైజర్ ఏమాత్రం పాటించడం లేదని, పరీక్ష పీజులు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఫర్నిచర్స్, కంప్యూటర్, సైన్స్ లాబ్స్, ఇలాంటి సదుపాయాలు ఏవి సక్రమంగా లేవని ఆయన అన్నారు.
విద్యాబోధన చేయడానికి అర్హులైన ఉపాధ్యాయులు లేరని, ఈ కళాశాలకు ఓ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధం ఏంటి అని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారులను కోరారు. లేని యెడల (ఏ.ఐ.ఎస్.బీ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్‌ను, జిల్లా నోడల్ అధికారి ఆఫీస్‌లను ముట్టడిస్తామన్నారు.