తెరాస ప్రభుత్వం పేదల పక్షం

గాంధారి, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని,దాని కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్బంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి ఇల్లు లేని పేదవానికి ఇల్లు కట్టి ఇవ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. అది కూడా గత ప్రభుత్వాల మాదిరిగా ఇరుకు ఇరుకు ఇండ్లు కావని, విశాలమైన డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు అని అన్నారు. ప్రభుత్వమే ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తుందన్నారు. గ్రామాలలో ఇల్లు లేని పేద వారిని గుర్తించి జాబితా తయారు చేయాలనీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.

త్వరలో గాంధారి మండలంలోని ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు కల్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నామని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇస్తూ, రైతు భీమా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. అలాగే దళిత బంధు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు లేదని అన్నారు. దళితుల అభివృద్ధి అలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కెసిఆర్‌ మాత్రమే అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందుతాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. గాంధారి మండలంలో స్పీకర్‌ పోచారం కృషితో డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ప్రారంభిస్తున్నామని అయన అన్నారు. విడుతల వారీగా మండలంలోని అన్ని గ్రామాలలో ఇల్లు లేని వారిని గుర్తించి ఇండ్లు కట్టించి ఇస్తామని అన్నారు.

ముదెల్లి నుండి నర్సాపూర్‌ గ్రామానికి రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కోరగా అటవీ శాఖ అనుమతులు తీసుకోని తొందరగా రోడ్డు వేయిస్తామని అన్నారు.రాష్ట్ర అభివృద్దే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ద్యేయం అని ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్‌, జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, తెరాస నాయకులు తానాజీ రావు, సత్యం రావు, ముకుంద్‌ రావు, శివాజీ రావు సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌, సొసైటీ చైర్మన్‌ సాయికుమార్‌, మాజీ మార్కెట్‌ సొసైటీ చైర్మన్‌ సాయికుమార్‌, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »