కోర్టులు నడిపేదెలా…
పెరుగుతున్న కోవిడతో ఆందోళన..
న్యాయవాదులతో సమావేశాలు..
జూన్ 8 నుంచి లాక్డౌన్ నిబంధను సడలించనుండడంతో న్యాయస్థానాల్లో పనులు తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో విచారణలు ఎలా నిర్వహిచాలన్న విషయంలో స్పష్టత రావడంలేదు.
రెండు నెలలుకు పై న్యాయస్థానాలు మూసి ఉండడంతో పున:ప్రారంభంతో ఒక్కసారిగా క్లయింట్ల తాకిడి పెరుగుతుందని న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. క్లయింట్లను కోర్టుకు రాకుండా చేయడం ఎలా అని సతమతమవుతున్నారు.
పనులు ప్రారంభించాలా వద్దా అని న్యాయవాదులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఏలా పనులు ప్రారంభించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ల అభిప్రాయాలు తీసుకుంది.
ఇప్పుడే పూర్తి స్థాయిలో కేసుల విచారణ ప్రాంరభమయ్యే అవకాశాలు లేవు. ట్రయల్స్ నిర్వహిస్తే కోర్టులో తాకిడి ఎక్కువవుతుదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యవసర కేసులతో పాటు, చివరి దశలో వాదనలు వినడానికి వాయిదా పడ్డకేసులు మాత్రమే విచారించే అవకాశం ఉంది.
కోర్టులు కోవిడ్ కేంద్రాలుగా మారరాదని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని రోహిణి కోర్టు న్యాయమూర్తి కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.