ఆర్మూర్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ మాట్లాడుతూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యువకులు 18 నుండి వంద సంవత్సరాల వరకు గల యువకులు వృద్ధులు తప్పకుండా కరోనా టీకా వేయించుకొని కరోనా బారినుండి తప్పించుకునే విధంగా జాగ్రత్తపడాలని సూచించారు.
ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలని తరచుగా శానిటైజర్ చేతులకు రుద్దుకోవాని వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త శ్యామల ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.