కామారెడ్డి, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
రాజీవ్ స్వగృహలోని గృహాలను, ఫ్లాట్లను చూడడానికి ఎంత మంది వస్తున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫార్మేషన్ రోడ్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో టీఎస్ఐఐసి నిజామాబాద్ జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రామదాసు, రాజేష్ స్వగృహ నోడల్ అధికారి సత్యనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారిణి శైలజ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.