క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిజామాబాద్‌ నగరంలో జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ నీలం రమేష్‌ హాజరై మాట్లాడారు. నాయకులందరూ కలసి కట్టుగా కృషి చేసి క్షేత్ర స్థాయిలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని బలోపేతం చేయాలన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో సమిష్టి నిర్ణయాలతో షర్మిలమ్మ ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని నాయకులు బుస్సాపూర్‌ శంకర్‌ తెలిపారు. కార్యక్రమంలో మహిళ నాయకురాలు కృప జ్యోతి, జీవి శ్రీనివాస్‌, విజయలక్ష్మి, అబేద్‌, ప్రసాద్‌, అరుణ్‌, విజయ్‌, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »