కామారెడ్డి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి చెందిన బుచ్చయ్య (60) వృద్ధునికి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు.
దీంతో సరంపల్లి గ్రామానికి చెందిన రాజు సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని స్ఫూర్తిగా తీసుకొని కామారెడ్డి జిల్లాలో చాలామంది రక్తదాతల సమూహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఆపదలో ఉన్న వారికి ఎల్లవేళలా రక్తాన్ని అందజేయడానికి కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ తరఫున, జిల్లా రక్తదాతల సమూహ తరఫున ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 నెంబర్‌కి సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, దేవేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.