డిచ్పల్లి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 9 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 16 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు.
అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 18 వ తేదీ వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 19 వ తేదీ వరకు 1000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 21 వ తేదీ వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 22 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.