అర్సపల్లి శివారులో ఆక్రమణల తొలగింపు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నార్త్‌ తహశీల్‌ కార్యాలయం పరిధిలోని అర్సపల్లి శివారులో గల సర్వే నంబర్‌. 249 /1 లోని ప్రభుత్వ స్థలాన్ని పలువురు ప్రైవేట్‌ వ్యక్తులు కబ్జా చేశారనే సమాచారం మేరకు బుధవారం నిజామాబాద్‌ నార్త్‌ మండలం తహసీల్దార్‌ ఎం.మధు, వారి సిబ్బందితో కలిసి కబ్జాకు గురైన స్థలాన్ని క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షెడ్డును, సిమెంట్‌ దిమ్మెలను, హద్దు రాళ్లను తొలగించారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నించిన అర్సపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు హారూన్‌ ఖాన్‌, ఖలీల్‌, కరీమ్‌, ఇమ్రాన్‌లపై నిజామాబాద్‌ 6 వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తమ ఫిర్యాదును అనుసరిస్తూ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో నలుగురు కబ్జాకు యత్నించిన వారిపై క్రైం నెంబర్‌ 24 / 2022, ఐపీసీ 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »