కామారెడ్డి, ఫిబ్రవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సూచించారు.
వివిధ రకాల ఉద్యోగాలు పొందడానికి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యే విధానాన్ని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు పొందాలని పేర్కొన్నారు. దాత ఆకుల గోపి కృష్ణ లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి వితరణ చేశారు. పుస్తకాలను వితరణ చేసిన దాత గోపి కృష్ణకు జిల్లా కలెక్టర్ సన్మానించారు.
గ్రంథాలయ భవనం పైన విద్యార్థులకు భోజనశాల షెడ్డు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, కౌన్సిలర్ అనూష, ఆర్‌అండ్‌బి అధికారులు, గ్రంథాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.