డిచ్పల్లి, ఫిబ్రవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పలువురు అధ్యాపకులకు అకడామిక్, పాలనాపరమైన పదవీ బాధ్యతలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గురువారం తన చాంబర్ లో అప్పగించారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఉత్తర్వులను జారీ చేశారు.
బీసీ సెల్ డైరెక్టర్‌గా మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రభంజన్ యాదవ్, మైనారిటీ సెల్ డైరెక్టర్‌గా ఉర్దూ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. గుల్ – ఇ – రాణా, కంప్యూటర్ సైన్స్ విభాగానికి బిఓఎస్ చైర్ పర్సన్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ నీలిమా నియామకం పొందారు.
తమపై పూర్తి బాధ్యతతో వివిధ పదవులలో నియమించినందుకు వీసీ, రిజిస్ట్రార్లకు ధన్యవాదాలు తెలిపారు. వివిధ పదవులను స్వీకరించిన అధ్యాపకులను పలువురు అధ్యాపకులు, పరిశోధకులు అభినందించారు.