కామారెడ్డి, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి చెందిన లచ్చవ్వకు (44) ఆపరేషన్ నిమిత్తము ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు.
కాగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హర్షకు తెలియజేయగానే వెంటనే స్పందించి ఏబి పాజిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి హర్ష ఎంతో ఆదర్శమని, నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు.
గతంలో కూడా 5 సార్లు రక్తదానం చేశారని గుర్తుచేశారు. హర్షను స్ఫూర్తిగా తీసుకొని ఆపద సమయంలో రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్,రాజు, పాల్గొన్నారు.