కామారెడ్డి, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వఛ్ఛ సర్వేక్షన్ గ్రామీణ సర్వేలో భాగంగా గత మూడు రోజులుగా జిల్లాలో పర్యటించిన అధికారుల బృందానికి ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వారికి సన్మానం చేశారు. సర్వే బృందం గత మూడు రోజులుగా వివిధ గ్రామాల్లోని అభివృద్ధి పనులను పరిశీలించారు.
వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్లు, మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రామస్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినట్లు సర్వే టీం లీడర్ కిషోర్ గౌడ్, సభ్యులు సునీల్ గౌడ్, భరత్, సంతోష్, మాణిక్యం, వెంకటేష్, రాకేష్, సునీల్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ వెంకట మాధవరావు, డిపిఓ ప్రభాకర్, ఏపీడి శ్రీకాంత్, డిపి ఎం సుధాకర్ పాల్గొన్నారు.