కామారెడ్డి, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బీజేపీ జెండాను కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన 43 మంది యువకులు కాషాయ కండువా కప్పుకొని బీజేపిలో చేరారు.
గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పేది ఏమి లేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేకనే రోజు రోజుకి బలపడుతున్న బీజేపీపై విషం కక్కుతున్నారని, రాష్ట్రంలో సమస్యలు ఎక్కడికక్కడ ఉంటే ఇక్కడ వదిలి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని పలకడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. చెప్పిన హామీలు నెరవేర్చ లేక అసహనంతో మాట్లాడుతున్నారు తప్ప దేశానికి ఏదో చేద్దాం అనే ఉద్దేశ్యంతో కాదు అని అన్నారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.