ఆర్మూర్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పుట్టినరోజు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, మండల పార్టీ అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు.
దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా జీవన్ రెడ్డి ఎన్నికైన తరువాత మొదటిసారి జిల్లాకు వస్తున్నందున పెద్ద ఎత్తున కార్లు, బైక్‌లతో ఇంధల్వాయి టోల్ ప్లాజా నుండి స్వాగత ర్యాలీ చేపట్టనున్నామని తెలిపారు. ర్యాలీ అనంతరం నిజామాబాద్‌లోని కలెక్టరేట్ మైదానంలో నిర్వహించే సభ, పుట్టినరోజు వేడుకల్లో జీవన్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ అమీర్, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారని, కావున జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
విలేకరుల సమావేశంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, మండల పార్టీ అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, దేగం ఎంపీటీసీ అనూష శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ సరోజ గంగారెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లింగారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ గౌడ్, ఎస్సి సెల్ అధ్యక్షుడు ప్రబుదాస్, యూత్ అధ్యక్షుడు ధర్మపురి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు ఎం.సి. గంగారెడ్డి, మండల సర్పంచ్‌లు మధు వర్మ, దాయనంద్, ప్రదీప్, నాయకులు ముత్యం రెడ్డి, గణేష్, శ్రీనివాస్ గౌడ్, జాన్సన్, ప్రవీణ్, రాజేశ్వర్, మహిపాల్, ఆరే రాజేశ్వర్, మల్లారెడ్డి, పడిగెల రాజు, సత్యం, ప్రభు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.