కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. బుధవారం స్థానిక సత్య గార్డెన్లో కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నందా రమేష్, నిమ్మ దామోదర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నరేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను కలిశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.