కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట మండలం ఇసానగర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణం కోసం స్థలాన్ని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివరాలను తహసీల్దార్ మోతిసింగ్‌ను అడిగి తెలుసుకున్నారు.
15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. క్యాసంపల్లి శివారులో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ భవనం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్లు ప్రేమ్ కుమార్, మోతి సింగ్, అధికారులు ఉన్నారు.