కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్‌మిల్లర్స్‌తో సీఎంఆర్ యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మిల్లుల వారీగా ఇంతవరకు మిల్లింగ్ చేసినా దాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్స్ మార్చి 6 లోగా మిల్లింగ్ వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. మిల్లింగ్ అధికంగా చేసిన రైస్ మిల్ యజమానులకు సన్మానం చేశారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా ఇంచార్జ్ సివిల్ సప్లై అధికారి రాజశేఖర్, జిల్లా రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, రైస్ మిల్లు యజమానులు పాల్గొన్నారు.