కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి సాగు చేసినట్లు సమాచారం వస్తే టాస్క్‌ఫోర్సు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ, వ్యవసాయ, ఎక్సైజ్ శాఖ అధికారులు క్షేత్ర పర్యటన చేసి గంజాయి సాగు చేస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
వారికి రైతుబంధు రద్దు చేయాలని పేర్కొన్నారు. గతంలో గంజాయి సాగు చేసిన వ్యవసాయ క్షేత్రాలలో ప్రస్తుతం ఏ పంటలు సాగు చేశారో వాటిని టాస్క్‌ఫోర్సు అధికారులు పరిశీలించాలన్నారు. ధరణి పెండిరగ్ ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో రవీందర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్డివోలు శ్రీను, రాజా గౌడ్, తహసిల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.