ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా..
సిబ్బందికి కూడా
జూన్ 30వరకు లాక్ డౌన్
మద్రాస్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు శుక్రవారం కోవిడ్19 గా తేలింది. వీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు కొందరు సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో మద్రాస్ హైకోర్టుకు తాళం వేశారు. మరికొందరు న్యాయమూర్తుల నివేదిక రావాల్సి ఉంది.
అత్యున్నత కమిటి సమావేశం…
హైకోర్టుకు తాళం..
ఆన్ లైన్ ద్వారా మాత్రమే విచారణ
ఈ నేపథ్యంలో హైకోర్టుకు తాళం వేయాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టుకు రావద్దని కోరింది. అత్యవసరం కేసుల విచారణ ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారించ నున్నారు.
మద్రాస్ హైకోర్టు తో పాటు మదురై బ్రాంచ్, తమిళనాడులోని అన్ని కోర్టులకు జూన్ 30 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసరి కేసుల విచారణ ఆన్ లైన్ ద్వారా మాత్రమే కొనసాగుతుందని హైకోర్టు ప్రకటించింది.