యూనివర్సిటీలో సిఎం జన్మదిన వేడుకలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్‌ స్కాలర్స్‌ అసోషియేషన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్‌ రావు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, పాలకమండలి సభ్యులు డా. మారయ్య గౌడ్‌, డా. కె. రవీందర్‌ విచ్చేసి కేక్‌ కట్‌ చేసి, సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఆర్‌టీసీ చైర్మన్‌ జన్మదిన వేడుకలను విద్యార్థి సంఘాల సమక్షంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలు మెచ్చిన నాయకుడని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అనితరమైన కృషి, సాధన చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల విద్యలో కూడా బోధనను ప్రవేశపెడుతూ విద్యార్థులు అంతర్జాతీయంగా ఎదిగేవిధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకోవడానికి ఆంగ్ల విద్యావలంబన అత్యవసరమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తమ తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలల్లో పెట్టి అధిక ఫీజులు చెల్లించి చదివించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ భారం పడకుండా రాష్ట్ర సర్కారే ఉచితంగా ఆంగ్ల విద్యను బోధించడం హర్షణీయమని అన్నారు. అదే విధంగా జలాశయాల నిర్మాణాలు, విద్యుత్‌ సరఫరా, తదితర అనేక సంక్షేమ పథకాలు సుదీర్ఘ కాలం వరకు ఉత్తమ ఫలితానందిస్తాయని పేర్కొన్నారు.

పాలకమండలి చైర్మన్‌ డా. మారయ్య గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలే గాకా దేశం గర్వించదగ్గ వ్యక్తి అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్‌ దేశానికి కూడా నాయకత్వం వహించాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు. ఫెడరల్‌ స్ఫూర్తితో ఐక్యతతో సాగివచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రులతో ముందుకు కదులుతున్న శుభ సందర్బాలను గుర్తు చేశారు.

కార్యక్రమంలో డా. చంద్రశేఖర్‌, డా. త్రివేణి, డా. రాంబాబు, డా. అబ్దుల్‌ ఖవి, డా. గుల్‌ – ఇ – రాణా, లక్ష్మణ్‌ పీడీ, విద్యార్థి నాయకులు డా. శ్రీనివాస్‌ గౌడ్‌, యెండల ప్రదీప్‌, పుప్పాల రవి, పులి జైపాల్‌, డా. రవీందర్‌ నాయక్‌ తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »