డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాతవహన విశ్వవిద్యాలయంలో మార్చి 30 వ తేదీన తెలంగాణ కామర్స్ అసోసియేషన్ మూడవ వార్షిక సదస్సు (టీసీఏ) జరుగనుందని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగాధిపతి, పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్ డా. జి. రాంబాబు తెలిపారు.
దీనికి సంబంధించిన కరపత్రాన్ని (బ్రోచర్) ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ కె. శివ శంకర్ వీసీ చాంబర్ లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సదస్సు ‘‘ఇంపాక్ట్ ఆఫ్ కోవిద్ -19 ఆన్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ’’ అనే అంశంపై నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కామర్స్ కళాశాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
పారిశ్రామిక, వ్యాపార రంగంలో కోవిద్ – 19 ప్రభావం వల్ల ఏర్పడిన కష్టనష్టాల మీద అధ్యయనం చేసి ప్రభుత్వానికి సరిjైున నివేదిక అందించాలని కోరారు. సమస్యల నష్టాన్ని పూరించదగిన పరిష్కార మార్గాలను విశ్లేషించుకోవాలని సూచించారు. బ్రోచర్ ఆవిష్కరణలో కామర్స్ ఫ్యాకల్టీ డా. శ్రీనివాస్, శ్వేత, డా. గంగాధర్, రాజు, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.