కామారెడ్డి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్‌షిప్‌లోని 230 ప్లాట్లకు మార్చి 14 నుంచి 17 వరకు గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యక్ష వేలం వేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ధరణి టౌన్‌షిప్ ప్లాట్‌ల ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు.
వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు కలెక్టర్ కామారెడ్డి పేరిట డి.డి. తీయాలని సూచించారు. ధరణి టౌన్‌షిప్ చుట్టూ ప్రహరీ గోడతో సహా లేఅవుట్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ టౌన్‌షిప్ ఉందన్నారు. ఇంటి స్థలానికి ఇన్, అవుట్ గేట్లు ఉన్నాయని సూచించారు. డిటిసిపి లేఅవుట్ అప్రూల్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
మార్చి 7న ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్ ఉందని తెలిపారు. ప్లాట్లు తీసుకున్న లబ్ధిదారులు 90 రోజులు పూర్తి డబ్బులు చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడారు. 86 గజాల నుంచి 677 చదరపు గజాల వరకు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ధరణి టౌన్ షిప్లో ని ఫ్లాట్ లను పరిశీలించారు. సమావేశంలో ఏజీఎం సత్యనారాయణ, టీఐసిసి జోనల్ మేనేజర్ రాందాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, డిఎస్‌పి సోమనాథం, టౌన్ ప్లానింగ్ అధికారిని శైలజ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.