ఆర్మూర్, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ గ్రామంలో ఈ నెల 19, 20 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆలూర్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని ఆహ్వానించారు.
19 వ తేది సాయంత్రం 4 గంటలకు ముఖ్య అతిథులచే క్రీడా పతాక ఆవిష్కరణ గావించి పోటీలను ప్రారంభిస్తామన్నారు. 20 వ తేదీ సాయంత్రం 7 గంటలకు ముగింపు కార్యక్రమంతో పాటు విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందన్నారు. కావున క్రీడాకారులు పాల్గొని గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు.