నిజామాబాద్, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇందూర్ నగరంలో స్థానిక శివాజీ నగర్‌లోని శంకర్ భవన్ పాఠశాల మైదానంలో శివాజీ ప్రభాత్ శాఖా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఫ్‌ు జిల్లా సంఘచాలక్ కాపర్తి గురుచరణం ప్రధాన వక్తగా విచ్చేసి మాట్లాడారు.
స్వాతంత్ర ఉద్యమ కాలంలో అందరూ స్వాతంత్ర సాధనకు ఏం చేయాలని ఆలోచిస్తే ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ మదిలో మాత్రం అసలు ఉన్న స్వాతంత్రం ఎలా పోయిందని నిరంతరం ఆలోచించేవాడని అన్నారు. అందుకు కారణాలను లోతుగా అధ్యయనం చేసిన డాక్టర్ హెడ్గేవార్ మన దేశం పరతంత్రం లోకి వెళ్ళుటకు ప్రధాన కారణం, భారతీయులలో ఉన్న అనైక్యత అని గుర్తించి, ఈ దేశ వాసులైన హిందువులలో సంఘటిత శక్తిని సాధించుటకుగాను నిరంతర సాధన అవసరమని గుర్తించి భవిష్య భారత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ వైభవం తిరిగి పునరుద్ధరించాలని వేల సంవత్సరాల విదేశీ బానిసత్వంలో మనం కోల్పోయిన మన ఆత్మాభిమానాన్ని, మన సాంస్క ృతిక చైతన్యాన్ని తిరిగి మేలుకొలపాలని ఐదుగురు బాలలతో 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ును మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో స్థాపించారన్నారు.
సంఘకార్యం అనేది అనాదిగా మన శ్రేష్ట సాంస్కృతిక వారసత్వ విలువలపై ఆధారపడి అందులో ఉన్న సుగుణాలను స్వీకరించి నిత్య సాధన ద్వారా వ్యక్తి నిర్మాణం గావించి తదనుగుణంగా సమాజ నిర్మాణం చేయాలని శాఖ అను విశిష్ట పద్ధతిని ఎంచుకుందన్నారు. నిత్య శాఖలో జరిగే కార్యక్రమాలు సామాన్యులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కుల మత వర్గ వర్ణ భాష ప్రాంత భేదాలు లేకుండా ప్రచారం ఆర్బాటం లేకుండా స్వయంసేవకులు విస్తృత సేవలను అందిస్తున్నారని గురుచరణం అన్నారు. రాబోయే రోజుల్లో భారతమాతను విశ్వగురు స్థానానికి చేర్చాలంటే సంఘ కార్యం మరింత విస్తరణ చెంది, గ్రామాల్లో శాఖలను ప్రారంభించి సంఘం సర్వవ్యాపి సర్వస్పర్శిగా ఉండేలా సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు నగర సంఘచాలక్ తిరుక్కోవళ్ళూరు శ్రీనివాస్, గంగ నరసయ్య, సత్యం, దత్తు, సుమిత్, శరత్, స్వయంసేవకులు మాతృమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.