ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

సంక్షేమ పథకాల వివరాలను సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రగతి నివేదికలను సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »