కెమిస్ట్రీలో అభిజిత్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగంలో పరిశోధక విద్యార్థి అభిజిత్‌ కంటంకర్‌కు పిహెచ్‌.డి. అవార్డ్‌ ప్రదానం చేయబడిరది. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (బహిరంగ మౌఖిక పరీక్ష) సోమవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల కెమిస్ట్రీ విభాగంలో జరిగింది.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో అచార్యులుగా నియమకం పొంది కొంతకాలం ఉండి నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆచార్య వై. జయప్రకాష్‌ రావు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి అభిజిత్‌ కంటంకర్‌ ‘‘సింథసిస్‌ అండ్‌ బయోలాజికల్‌ స్టడీస్‌ ఆఫ్‌ నావెల్‌ హెటిరో సైక్లిక్‌ రింగ్‌ పెండెంట్‌ / అనులేటెడ్‌ క్రోమోన్‌ డిరైవెటీవ్స్‌’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించి సమర్పించారు.

వైవా – వోస్‌ కు ఎక్సటర్నల్‌ ఎగ్జామినర్‌గా హైదరాబాద్‌ ఐఐసిటిలో గల ఫ్లోరో అండ్‌ ఆగ్రోకెమికల్స్‌ డివిజన్‌ లోని సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, ప్రొఫెసర్‌ ఎసిఎస్‌ఐఆర్‌ కు చెందిన డా. లింగయ్య నాగారపు విచ్చేసి పరిశోధాంశంపై పలు ప్రశ్నలు అడిగి పరిశోధకుడిని సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి అతడి పరిశోధనా కాలంలో వివిధ జర్నల్స్‌లో ప్రచురణ పొందిన ఆర్టికల్స్‌ను, సైటేషన్‌ను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాను స్టాన్‌ ఫర్డ్‌ యూనివర్సిటీలో ఉత్తమ ర్యాంక్‌ సాధించి, ప్రపంచ శాస్త్రవేత్తలలో ఒకడిగా పేరు ప్రఖ్యాతలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.

వైవా వోస్‌కు సైన్స్‌ డీన్‌ ఆచార్య ఎం. అరుణ చైర్‌ పర్సన్‌గా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ బిఒఎస్‌ డా. బి. సాయిలు కన్వీనర్‌గా వ్యవహరించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విభాగాధిపతి డా. జి. బాలకిషన్‌, అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. నాగరాజ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. నాగరాజు, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య బి. విద్యావర్ధిని, హ్యుమానిటీస్‌ డీన్‌ ఆచార్య పి. కనకయ్య, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (కాంట్రాక్ట్‌), పార్ట్‌ టైం అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »