డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టిఎస్ కాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28 వ తేదీన ‘‘పాపులర్ సైన్స్ లెక్చర్స్ ప్రోగ్రాం’’ అనే కార్యక్రమంగా నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు టిఎస్ కాస్ట్ ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ డా. చంద్రశేఖర్ వాసం, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. సత్యనారాయణ మావురపు ఒక ప్రకటనలో తెలిపారు.
దీనికి సంబంధించిన కరపత్రం (బ్రోచర్) ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ప్రారంభ ప్రసంగాన్ని చేయనున్నారు. హైదరాబాద్ దివిస్ లాబోరేటరీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డా. జి. కుమారస్వామి, హైదరాబాద్ ఐఐసిటి ఇన్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ డివిజన్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. ఆకుల వేణుగోపాల్, హైదరాబాద్ ఇఫ్లూ విశ్వవిద్యాల్యం అండ్ రాజభవన్ అకడమిక్ ఇంచార్జి డా. కె. రాజారాం ప్రధాన వక్తలుగా విచ్చేయనున్నారు.
బ్రోచర్ ఆవిష్కరణలో పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, డా. చంద్రశేఖర్, డా. సత్యనారాయణ, డా. జయప్రకాష్ రావు, ఐఐసిటి ప్రొఫెసర్ డా. లింగయ్య నాగారపు, డ. బాల కిషన్, ఆచార్య పి. కనకయ్య, డా. రామేశ్వర్, నర్సయ్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.