సుమోటోగా స్వీకరించిన కమీషన్…
సంఘటనపై తీవ్ర ఆందోళన ..
కఠిన చర్యలకు ఆదేశం
కేరళ కు చెందిన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై జాతీయ మహిళా కమీషన్ విచారణకు ఆదేశించింది. కేసును సుమోటోగా స్వీకరించిన కమీషన్ కేసుకు సంబంధించిన వివరాలను కేరళ పోలీసుల నుంచి తెలుసుకుంది. దీనిపై విచారణ ప్రారంభించింది
తిరువనంతపురంలో 25 ఏళ్ల మహిళపై ఆమె భర్త, అతని స్నేహితులు, తన ఐదేళ్ల కుమారుని ఎదుటే లైగిక దాడి చేశారు. బలవంతంగా మద్యం తాపి మహిళను సిగరెట్ పీకలతో కాల్చినట్టు పోలీసుల మహిళ పోలీసులకు వివరించింది.
ఈ సంఘటనను ఎన్‌సిడబ్ల్యు స్వయంగా తెలుసుకుని, రాష్ట్రంలో మహిళల భద్రత ఉల్లంఘన గురించి ఆందోళన వ్యక్తం చేసింది. , ఇటువంటి సంఘటనలను “నిర్లక్ష్యం చేయలేము మరియు చర్యలు తీసోవాల్సిన అవసరం ఉంది” అని పేర్కొంది.
“ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు, తిరువనంతపురం రూరల్ ఫోలీసులు మహిళా కమీషన్ కు వివరించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపామని వివరించారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) నిబంధనల ప్రకారం నిందితులపై కూడా అభియోగాలు మోపనున్నట్లు అధికారి తెలిపారు. నిందితులు డ్రగ్స్ పెడ్లింగ్ ముఠాలో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు.