కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆల్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు పిడి అకౌంట్ ఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అకౌంటెంట్ జనరల్ ఆడిట్ పై సమీక్ష నిర్వహించారు.
ఆడిట్‌కు గ్రామ పంచాయతీలలో రికార్డులు సిద్ధంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు. మున్సిపల్లో ఆడిట్ కు రికార్డులను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా ప్లానింగ్ అధికారి రాజారాం, మునిసిపల్, మార్కెటింగ్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.