అవగాహన ఉంటే రక్షణ పొందవచ్చు

కామారెడ్డి, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ఎయిడ్స్‌ పై కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమం బోర్డుపై జెండా ఊపి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ పై ప్రతి ఒక్కరూ అవగాహన ఉంటేనే దాని నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. కళాజాత కార్యక్రమాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సుజాయత్‌ , ప్రోగ్రాం మేనేజర్‌ సుధాకర్‌, వర్డ్‌ సేవా సంఘం, చైల్డ్‌ ఫండ్‌ ఇండియా ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »