నిజామాబాద్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర మరియు ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 280మంది యువతీయువకులు జాబ్ మేళాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా ఎస్బిఐ మరియు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రెండు కంపెనీలు 60మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధి శిక్షణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెలా తాము నిర్వహించే జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర యువత యొక్క నైపుణ్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇంటర్వ్యూలో ఎంపిక చేయబడ్డ వారికి నియామక పత్రాలను అధికారులు అందించారు. కార్యక్రమంలో సిబ్బంది మహేష్, ఎస్బిఐ, ఎయిర్టెల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.