నిజామాబాద్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. రిట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికిల్, బ్యాటరీ వీల్ చైర్, సాధారణ వీల్ ఛైర్, చంక కర్రలు, చేతి కర్రలు, కృత్రిమ అవయవాలు, ల్యాప్ టాప్, మూడు చక్రాల రిక్షా, డైసీ ప్లేయర్‌లు, ఎంపిత్రీ ప్లేయర్లు, 4జీ స్మార్ట్ ఫోన్లు, బోధనకు ఉపకరించే పరికరాలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. దివ్యాంగ విద్యార్థులు, దివ్యాంగులు వారికి అవసరమైన పరికరాల కోసం సంబంధిత ధ్రువపత్రాలు జతచేస్తూ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన వారిని జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేసి రాష్ట్ర మహిళా, శిశు, వయోవృద్దులు, దివ్యాంగుల సంక్షేమ శాఖకు పంపడం జరుగుతుందన్నారు. అదనపు సమాచారం కోసం 08462-251690 ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.