నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించబడిన జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీల విజేతలను ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాకు మొదటి స్థానంలో అక్షిత, రెండవ స్థానం శ్రీజ జాదవ్, కామారెడ్డి జిల్లా మొదటి స్థానం మౌనిక, రెండవ స్థానం అనిల్ రాథోడ్ గెలుపొందారు.
వీరు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు, అక్కడ గెలుపోందితే జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఆర్హత సాధిస్తారు. విజేతలను నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ అభినందించారు. రాష్ట్ర ,జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబర్చాలని సూచించారు.