కామారెడ్డి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలం మొటాట్ పల్లి గ్రామంలో సుమారు 23 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెల రూపురేఖలు మారాయని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలైన ప్రకృతి వనం, వైకుంటధామం, మిషన్ భగీరథ నీరు, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ లాంటి వసతులు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.