డిచ్పల్లి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో గల గత డిసెంబర్, 2021, జనవరి 2022 నెలల్లో కొన్ని జరిగి మరికొన్ని వాయిదా పడిన ఐఎంబిఎ రెండవ, నాల్గవ సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు మార్చి నెల 3 వ తేదీ నుంచి పున:ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్ షెడ్యూల్డ్ విడుదల చేశారు.
కావున ఈ విషయాన్ని ఎంబిఎ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ విశ్వవిద్యాలయ వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.