కామారెడ్డి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేశారని, దాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండే విధంగా చూశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బర పడుతుందని తెలిపారు.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం పనులు నాణ్యతతో జరిగాయని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ శోభ, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గోవర్ధన్, ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంతు షిండే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియా, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.