డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం ఆంటి ర్యాగింగ్ అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు ఆంటి ర్యాగింగ్ కమిటీ కన్వీనర్ మరియు విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్ విచ్చేయుచుండగా ముఖ్య అతిథిగా నిజామాబాద్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎ. వెంకటేశ్వర్, విశిష్ట అతిథులుగా డిచ్‌పల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. ప్రతాప్, దర్పల్లి ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ పుప్పాల శ్రీశైలం తదితరులు హాజరు కానున్నట్లుగా ఆమె తెలిపారు. కావున అవగాహనా సదస్సులో అధిక సంఖ్యలో విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొనాలని ఆమె కోరారు.
బ్రోచర్ ఆవిష్కరణలో వీసీతో పాటుగా ప్రధాన క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డా. కె. లావణ్య, డా. రవీందర్ రెడ్డి, డా. రాంబాబు, డా. త్రివేణి, డా. ప్రభంజన్ కుమార్, డా. భ్రమరాంబిక, డా. అబ్దుల్ ఖవి, జవేరియా ఉజ్మా తదితరులు పాల్గొన్నారు.