బోధన్, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బోధన్ నియోజకవర్గం ఏడపల్లి మండలం ఎంఎస్‌సి ఫారం గ్రామంలో తెరాస పార్టీ నుండి పలువురు యువ నాయకులు బోధన్ అర్బన్ కో – ఆర్డినేటర్ గౌతం ప్రసాద్ నాయకత్వంలో వైఎస్‌ఆర్ టిపిలోచేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ నీలం రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిరచారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రి ఏంబర్స్‌మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చెయ్యకుండా కాలయాపన చెయ్యటం ఎంత వరకు సబబు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం బోధన్ అర్బన్ కో ఆర్డినేటర్ గౌతం ప్రసాద్ మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు ఇస్తానన్న రిజర్వేషన్స్ ఎటు పోయాయని నిలదీశారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ త్వరగా తెరవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ ఉద్యమ నాయకులకు టీఆర్‌ఎస్ పార్టీలో అన్యాయం జరుగుతుందని, ప్రతి తెలంగాణ బిడ్డ ధైర్యంగా ఉండాలని రాబోయే రోజుల్లో ప్రతి తెలంగాణ బిడ్డకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
రాబోయే రోజుల్లో రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే విధానాలను చేపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కో ఆర్డినేటర్ విజయలక్ష్మి, నిజామాబాద్ అర్బన్ మహిళా కో ఆర్డినేటర్ కృపాజ్యోతి, బోధన్ నాయకులు జగన్, రాజు, గోవింద్, తోట సుధాకర్, శారద, నందిని తదితరులు పాల్గొన్నారు.