నిజామాబాద్, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ నగరంలోని బడా బజార్ చౌరస్తా వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వైఎస్ షర్మిలమ్మ చేస్తున్న పోరాటాలకు, దీక్షలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం నిజామాబాద్ నగరానికి చెందిన వైఎస్ఆర్ వీరాభిమాని, నిస్వార్థంగా రాజన్న కుటుంబం కోసం పనిచేస్తున్న భిక్షపతిని బుస్సాపూర్ శంకర్ సన్మానించారు. ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ రాజన్న అభిమానులను వైఎస్ఆర్ కుటుంబం ఎప్పటికి మర్చిపోదని, పార్టీ ఎప్పుడు అభిమానులకు అండగా ఉంటుందన్నారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న షర్మిలమ్మకు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు పోతరాజు మదన్, ఆబేద్, ప్రితం, వెంకట్ రెడ్డి, రాజా రెడ్డి, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.